View

ఆ మాటలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి - మేమ్ ఫేమస్ టీమ్

Thursday,May25th,2023, 03:39 PM

రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'మేమ్ ఫేమస్'. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హై బజ్ ని క్రియేట్ చేసింది మేమ్ ఫేమస్. ఈ చిత్రం ఈనెల 26 న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది.


ప్రెస్ మీట్ లో నిర్మాత అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ.. నా జీవితంలో చాలా మిరాకిల్స్ చూశాను. పరిశ్రమకి చదువుని పట్టుకొని వచ్చాను. ఒక మిరాకిల్ లా పరిశ్రమలో అందరూ సపోర్ట్ తో ఇక్కడి వరకూ వచ్చాం. ఏమీ లేకుండా మిరకిల్ గా సపోర్ట్ చేసే తత్త్వం నాకు మైండ్ లో వుండిపోయింది. మనం కూడా మన శక్తి మేరలో సపోర్ట్ చేయాలనీ ఛాయ్ బిస్కెట్ లో అందరూ కొత్తవారితో సినిమాలు చేయాలని సినిమాలు చేస్తూ వస్తున్నాం. ‘మేజర్’ సినిమాకి మహేష్ బాబు గారి రూపంలో పెద్ద మిరాకిల్ జరిగింది. మహేష్ బాబు గారి స్ఫూర్తితో  మంచి సినిమాలని ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. 'మేమ్ ఫేమస్' లో అందరూ కొత్తవాళ్ళు. అందరూ మీకు గుర్తుండిపోతారు. మహేష్ బాబు గారు 'మేమ్ ఫేమస్' సినిమా చూసి ఇంత గొప్పగా మాట్లాడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సినిమా విడుదల కాకముందే సుమంత్ ప్రభాస్ తో మరో సినిమా చేయాలని మహేష్ బాబు గారు ముందుకు రావాడం మాజా అనిపించింది. మహేష్ బాబు గారి గట్స్ కి హ్యాట్సప్. మాకు సపోర్ట్ చేసిన ప్రతి సెలబ్రిటీకి థాంక్స్. ఇందులో అందులో కుర్రాళ్ళు చేశారు. మీరు సినిమా చూసినప్పుడు వారి ఆలోచనల్లోని బరువుని మీరు ఫీలౌతారు. వారితో పాటు రెండున్నర గంటలు ప్రయాణిస్తారు. థియేటర్ లో మజా చేస్తారు'' అన్నారు.


సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. మా గురించి మహేష్ బాబు గారి ట్వీట్ చదువుతున్నపుడు నమ్మలేకపోయాను. నెక్స్ట్ సినిమా అనురాగ్, శరత్ లతో కలసి మహేష్ బాబు నిర్మిస్తామని చెప్పడం అద్భుతం అనిపించింది. ఇంత గొప్పగా మమ్మల్ని ప్రోత్సహించిన మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు.  అనురాగ్, శరత్, చంద్రు అన్నలకి థాంక్స్. చాలా సపోర్ట్ చేశారు. మా టీమ్ అందరికీ థాంక్స్. ప్రిమియర్ షోస్ ఫుల్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. టికెట్ బుక్ చేసుకున్న అందరూ చాలా మంచి సినిమా చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు.  


శరత్ చంద్ర మాట్లాడుతూ..మా టీం అంతా ఒక ఫ్యామిలీలా పని చేశాం. ప్రిమియర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. కొత్తవారితో చేసిన సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి కారణమైన.. విజయ్ దేవరకొండ, చై, అల్లు అరవింద్ గారు, విశ్వక్ సేన్, శేష్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్..అందరికీ థాంక్స్. సుమంత్ అండ్ టీం చాలా పాజిటివ్ గా వుంటారు. తను అనుకున్నది జరిగిపోతుంది, అంత పాజిటివ్ గా వుంటారు. మహేష్ బాబు గారు ప్రిమియర్ చూశారు. సినిమా గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ముఖ్యంగా సుమంత్ గురించి. కాస్త ధైర్యం తెచ్చుకొని సుమంత్ తో  చేసే కొత్త సినిమాకి నిర్మాతగా వుంటే బావుంటుదని కోరాను. ఆయన సరే అని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇదంతా సుమంత్ పాజిటివిటీతో జరుగుతుంది. చాలా పాజిటివ్ గా సినిమా చేశాం. థియేటర్ నుంచి బయటికి వెళ్ళినపుడు ఆ పాజిటివ్ ఫీల్ అవుతారు. యూత్, ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమాపై చాలా నమ్మకంగా ఎక్సయిటెడ్ గా వున్నాం. థియేటర్లో చాలా ఎంజాయ్ చేశారు. సినిమా దావత్ లా వుంటుంది'' అన్నారు.  


చంద్రు మనోహర్ మాట్లాడుతూ..ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. ఈ రోజు మహేష్ బాబు గారు ట్వీట్ చేసి యంగ్ టీమ్ అందరినీ సపోర్ట్ చేశారు. మహేష్ బాబు గారి మాటలు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి. ప్రిమియర్స్ సొల్ద్ అవుట్ అయ్యాయి. కొత్త దర్శకుడు, నటుడి సినిమాకి ఇలా జరగడం చాలా గర్వంగా వుంది'' అన్నారు.


సార్య మాట్లాడుతూ.. ప్రిమియర్ రియాక్షన్స్ చూశాక చాలా అనందంగా అనిపించింది. సినిమాలో కొన్ని మూమెంట్స్ వున్నాయి. నవ్విస్తాయి, ఏడిపిస్తాయి.. అంత కనెక్టింగా వుంటాయి. అందరూ థియేటర్ కి వచ్చి చూడండి. టీం అందరికీ థాంక్స్'' అన్నారు.

  
సిరిరాసి మాట్లాడుతూ.. ఛాయ్ బిస్కెట్ లో యూట్యూబ్ జర్నీ నా కెరీర్ మొదలై ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైకి రావడం చాలా అనందంగ వుంది. ప్రిమియర్ చూస్తున్నప్పుడు వస్తున్న రియాక్షన్ చూసి చాలా తృప్తి ఇచ్చింది. ప్రతి పాత్రతో రిలేట్ అవుతారు. థియేటర్ లో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.


శివ, నరేంద్ర, మణి ఎగుర్ల, మౌర్య, కిరణ్ తదితరులు ఈ  ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !