View

‘పర్‌ఫ్యూమ్’ సుగంధం కచ్చితంగా వ్యాపిస్తుంది - జే.డి.స్వామి

Friday,November17th,2023, 01:41 PM

స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ఇంత వరకు ఏ సినిమా రాలేదు. అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘పర్‌ఫ్యూమ్’ అనే చిత్రం రాబోతోంది. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి. స్వామి దర్శకత్వంలో తెరకకెక్కగా... జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ "పర్‌ఫ్యూమ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్‌ను చిత్రయూనిట్ ఘనంగా సత్కరించింది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ విష్ణుమూర్తి గారు, ఐఆర్ఎస్ మురళీ మోహన్ గారు, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేతి ప్రవీణ్ రెడ్డి గారు, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడింది.


హీరో చేనాగ్ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల క్రితం జేడీ నాకు ఈ పర్‌ఫ్యూమ్ ఐడియా చెప్పారు. చాలా మంది దగ్గరకు వెళ్లాం. కానీ కొంత మందికి ఈ కథ అర్థం కాలేదు. చివరకు ఈ కారెక్టర్ నేనే చేశాను. రావూరి శ్రీనివాస్, శివ, సుధాకర్, రాజీవ్, రాజేంద్ర అన్న ఇలా అందరూ కలిసి నన్ను ముందుకు నడిపించారు. చంద్రబోస్ గారు ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుచిత్రా చంద్రబోస్ గారి సాయం ఎప్పటికీ మరిచిపోలేను. స్మెల్లింగ్ అబ్‌సెషన్‌తో కూడిన కథను ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదు. ఈ మూవీలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. డార్క్ మోడ్‌లో నా కారెక్టర్ ఉంటుంది. నాకు మళ్లీ ఇలాంటి ఒక మంచి కారెక్టర్ దొరకదు. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ స్వామికి థాంక్స్. నవంబర్ 24న చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.


ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా గురించి, నా మీద పాట రాశారు, పాడారు. నాకు బహుమతిగా ఆ పాటను ఇచ్చిన టీంకు థాంక్స్. ఆస్కార్ వచ్చిన ఆ మూమెంట్‌ను మళ్లీ చూడటంతో ఎమోషనల్ అయ్యాను. జేడీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నేను రాసిన పాటకు ఎంతో చక్కటి బాణీలను అజయ్ అందించారు. కెమెరామెన్ అద్భుతంగా తీశారు. జేడీ మనసును దర్శించిన నేత్రమే కెమెరామెన్. ఇందులో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసిన నా సతీమణి సుచిత్రకు ఆల్ ది బెస్ట్. ఆచార్య ఆత్రేయ పాటలు, శైలి, రీతి, ప్రవర్తనే నా జీవితంలో పరిమళం. దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలి’ అని అన్నారు.


అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నేను చేసిన సినిమాకు నగేష్ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. నేను ఒక సినిమా చేశాను.. గెస్టుగా రమ్మని అడిగారు. ఆయనకెన్నో క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


డైరెక్టర్ జే.డి. స్వామి మాట్లాడుతూ.. ‘కొత్తదనం, కొత్త పాయింట్‌తో సినిమా చేస్తే కచ్చితంగా మంచి ప్రతిఫలం వస్తుంది. ఆ సుగంధం కచ్చితంగా వ్యాపిస్తుంది. నా గురువు చంద్రబోస్ గారే నాకు స్పూర్తి. నవంబర్ 24న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో మాట్లాడుతూ.. ‘పర్‌ఫ్యూమ్ టీంకు ఆల్ ది బెస్ట్. నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది. చంద్రబోస్ గారే మాకు స్పూర్తి. ఆయనే ఈ సినిమాకు పెద్ద దిక్కయ్యారు. నా జీవితంలో పాటే పర్‌ఫ్యూమ్. ఆ పాట వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను’ అని అన్నారు.


హీరోయిన్ ప్రాచీ థాకర్ మాట్లాడుతూ.. ‘మూవీలో లీలా అనే పాత్రలో నటించాను. థ్రిల్లర్, లవ్ స్టోరీలో నటించాను. ఇలాంటి జానర్‌లో సినిమా రావడం ఇదే మొదటి సారి. ఎంతో కొత్తగా ఉంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ.. ‘చంద్రబోస్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా టీం అంతా కూడా నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ గారి పాటలు వినే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను’ అని అన్నారు.


కెమెరామెన్ మహేష్ మాట్లాడుతూ.. ‘నాగేశ్వర్ నాకు స్నేహితుడు. నా మిత్రుడి కోసం ఈ చిత్రానికి పని చేయాలని అనుకున్నాను. ఈ మూవీకి పని చేయడం ఆనందంగా ఉంది. చంద్రబోస్ సాహిత్యం, అజయ్ సంగీతం బాగుంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !