View

ప్రశ్నిస్తా... సినిమా ప్రారంభోత్సవ విశేషాలు

Thursday,March22nd,2018, 04:01 PM

జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్నేం రెడ్డి దర్శకత్వంలో భారీ హంగులతో అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ లో మనీష్ బాబుకి జోడిగా హీరోయిన్ అక్షిత నటిస్తుంది.


నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ: గత 20 సంవత్సరాలనుండి తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా ఉంటూ అనేక చిత్రాలను నిర్మిస్తున్న మా సంస్థ నుండి మనీష్ బాబు ని పరిచయం చేస్తూ ఈ 'ప్రశ్నిస్తా' మూవీ ని ప్రారంభించడం జరిగింది. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాజా వన్నేం రెడ్డి మనీష్ లోని టాలెంట్ ని చూసి తానే మనీష్ ని వెండితెరకు పరిచయం చేస్తానని... గత రెండేళ్లుగా మనీష్ కి నటనలో శిక్షణ ఇప్పిస్తూ డైలాగ్ దగ్గరనుండి, డాన్స్ లు వంటి వాటిని దగ్గరనుండి శిక్షణ ఇప్పించి మరీ మనీష్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. మనీష్ మీదున్న ప్రేమతో మంచి సబ్జెక్టు ని తీసుకుని ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం మొదలు పెట్టారు. అలాగే హీరోయిన్ అక్షిత కూడా మన తెలుగమ్మాయి, మరో దివ్య భారతి లాంటి అందంతో.. నటనలో ఈ సినిమాతో అక్షిత మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని నమ్మకం వుంది అన్నారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన, అలాగే మా బాబు మనీష్ అశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాని ముగించారు.


దర్శకుడు రాజా వన్నేం రెడ్డి మాట్లాడుతూ: అందరూ సక్సెస్ వెంట పరిగెడుతున్న ఈ రోజుల్లో నిర్మాత సత్యారెడ్డి నన్ను నమ్మి తన కొడుకు మనీష్ బాబుని నాకు అప్పగించారు. నేను మనీష్ బాబుని మంచి హీరోగా తీర్చిదిద్దడానికి కావాల్సిన శిక్షణ ఇప్పించి మరీ ఒక మంచి కథతో... కమర్షియల్ హీరోగా తయారు చెయ్యాలని... నేనే మళ్ళీ నా మొదటి సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను అన్నట్టుగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సమయంలో మా గురువు గారు దాసరి నారాయణ రావు గారు ఉంటే చాలా సంతోష పడేవారు. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్టు ఆయనకు కూడా తెలుసు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను.


హీరో మనీష్ బాబు మాట్లాడుతూ: రాజా వన్నేం రెడ్డి గారు మా ఇంట్లో మనిషిగా కలిసి పోయి నా విషయంలో చాలా కేర్ తీసుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషం గా వుంది. నేను హీరో అవ్వాలన్న నా కోరికను రాజా వన్నేం రెడ్డి గారు గుర్తించి నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గాను నేను ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాను. మంచి కథాంశంతో వస్తున్న ఈ చిత్రం మీ అందరికి నచ్చుతుంది అని నమ్ముతున్నాను. వన్నేం రెడ్డి గారు చెప్పిన కథని నమ్మి... నాన్న సత్యారెడ్డి గారు చాలా మంది నిర్మతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తామని చెప్పినా... కాదని ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 


హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ: నా టాలెంట్ ని నమ్మి దర్శక నిర్మతలు నాకు ఈ మూవీ లో నటించే అవకాశమిచ్చారు.. వాళ్లకు నా కృతఙ్ఞతలు.


టెక్నీకల్ లిస్ట్:
సమర్పించువారు: బి. శేషుబాబు, రచయిత: రాజేంద్ర కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ రెడ్డి, కో ప్రొడ్యూసర్స్: కె. నారాయణ రెడ్డి, శంకర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: యోగి రెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, మ్యూజిక్ డైరెక్టర్: ఎల్. ఎం ప్రేమ్, డైరెక్టర్: రాజా వన్నేం రెడ్డి, నిర్మాత: సత్యా రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !