సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు (9.8.2020) 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుని 'సర్కారు వారి పాట' చిత్రం యూనిట్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రూపాయి కాయిన్ ఎగరేస్తున్న మహేష్ బాబు మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. డబ్బు చుట్టూ ఈ సినిమా నేపధ్యం తిరుగుతుందని మోషన్ పోస్టర్ తెలియజేస్తోంది. ఈ ఆసక్తికరమైన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.
మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నారు. మోషన్ పోస్టర్ అందరినీ శాటిస్ ఫై చేసింది. డైరెక్టర్ పరశురామ్ సరికొత్తగా మహేష్ బాబును ప్రజెంట్ చేయబోతున్నాడని ఊహించవచ్చు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి యస్.యస్.తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జి.యం బి ఎంటర్ టైన్ మెంట్స్ , 14 ప్లస్ రీల్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.