శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ని ముంబయ్ లోని లీలావతి హాస్పటల్ కి తీసుకెళ్లడం జరిగింది. హాస్పటల్ వర్గాలు సంజయ్ దత్ కి కరోనా టెస్ట్ లు నిర్వహించారు. టెస్ట్ ల్లో నెగటివ్ రావడంతో సంజయ్ దత్ హ్యాపీగా ఇంటికి వచ్చేసాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. అయితే ఆ తర్వాత షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే...
సంజయ్ దత్ కి నిర్వహించిన టెస్ట్ ల్లో లంగ్ క్యాన్సర్ మూడవ స్టేజ్ లో ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయం సంజయ్ దత్ సన్నిహితుడు ద్వారా బయటపడింది. క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం సంజయ్ దత్ అమెరికా వెళుతున్నాడు. ప్రస్తుతం దత్ భార్య, పిల్లలు దుబాయ్ లో ఉన్నారు. క్యాన్సర్ 3వ స్టేజ్ లో ఉంది కాబట్టి, ట్రీట్ మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందని డాక్టర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. సో... సంజయ్ దత్ ట్రీట్ మెంట్ తీసుకుని ఈ వ్యాధి నుంచి బయటపడాలని, క్షేమంగా ఇండియా తిరిగి రావాలని కోరుకుందాం.